సేవా కార్యక్రమాలు భావి పౌరులకు స్పూర్తిదాయకం

సేవా కార్యక్రమాలు భావి పౌరులకు స్ఫూర్తిదాయకం

సబ్ ఇన్స్పెక్టర్ అమీనుద్దీన్

రాజధాని వాయిస్:నవంబర్ 18,సత్తెనపల్లి.

ఆకలి విలువ తెలిసిన వారు మాత్రమే ఇతరుల ఆకలి బాధను అర్థం చేసుకొని వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేయగలుగుతారని సత్తెనపల్లి రూరల్ మండల సబ్ ఇన్స్పెక్టర్ షేక్ అమీనుద్దీన్ అన్నారు.రెంటపాళ్ల గ్రామానికి చెందిన కట్టెకోట శ్రీనివాసరావు మనవరాలు చిరంజీవి ఖ్యాతి అక్షర పుట్టినరోజు సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని మొల్లమాంబ అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా ఎసై మాట్లాడుతూ కుటుంబంలోని పిల్లల పుట్టినరోజులు ఇటువంటి చోట్ల జరుపుకోవడం వలన పిల్లల్లో కూడా చిన్నప్పటినుండి సేవాభావం, క్రమశిక్షణ అలవడుతాయని కట్టెకోట శ్రీనివాసరావును అభినందించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి తవిటి భావనారాయణ మాట్లాడుతూ కట్టెకోట శ్రీనివాసరావు పది ఏళ్ళుగా క్రమం తప్పకుండా మనవరాలి పుట్టినరోజును పురస్కరించుకొని వృద్ధాశ్రమాలలో ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపడుతూ, కార్యక్రమంలో తనను కూడా భాగస్వామ్యం చేస్తూ సేవా కార్యక్రమాలకు స్ఫూర్తినిస్తున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, మారిశెట్టి వీరాంజనేయులు, పులిబండ్ల చిన్న వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares