సేంద్రియ వ్యవసాయం ముద్దు – యూరియా వద్దు
పల్నాడు ప్రాజెక్టు మేనేజర్ కె. అమలకుమారి
రాజధాని వాయిస్:దుర్గి.అక్టోబర్ 27
సోమవారం మండలంలోని కోలగొట్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు పొన్నూరి వెంకయ్య సాగు చేస్తున్న మిరప పంట పొలాలనుపల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె. అమలకుమారి సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ బాటలో రైతన్నలకు ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ అన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలను సాగు చేయడం వలన రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గి, దిగుబడులు పెరిగి, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు మిరప ప్రధాన పంటతో పాటు బంతి, బెండ, ఉల్లి వంటి అంతర పంటలను సాగు చేసే విధానాన్ని పరిశీలించి, రైతులతో మంతనాలు జరిపారు.మిరప పంటను రక్షించడానికి జొన్న, మొక్కజొన్న వంటి కవర్ క్రాప్స్ వేయడం ద్వారా పురుగుల బారి నుండి రక్షణ పొందవచ్చని ఆమె సూచించారు. రైతు సోదరులందరూ సేంద్రియ వ్యవసాయం ముద్దు యూరియా వద్దు అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ప్రకృతి పద్ధతుల్లో పండిన పంటలను వినియోగించడం వల్ల ప్రజలు రోగాల బారినుండి దూరంగా ఉండగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాచర్ల మాస్టర్ ట్రైనర్ వినోద, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



Post Comment