సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని గుర్తించవచ్చు

ఎక్సైజ్ సీఐ రవి

అక్టోబర్ 26 రాజధాని వాయిస్: వేమూరు,

మద్యం వినియోగదారులు సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని గుర్తించే విషయంపై అవగాహన కలిగి ఉండాలని ఎక్సైజ్ సీఐ రవి తెలియజేశారు, ఆదివారం స్థానిక మద్యం షాపులో సురక్ష యాప్ క్యూఆర్ కోడ్ పై మద్యం వినియోగదారులకు అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిమద్యం దుకాణం వెలుపల సురక్ష యాప్ క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంటుందన్నారు మద్యం వినియోగదారులకు అనుమానం వచ్చినట్లయితే సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని గుర్తించే అవకాశం ఉందన్నారు ఈ సదవకాశాన్ని మద్యం వినియోగదారులు వినియోగించుకోవాలని తెలియజేశారు, సురక్ష యాప్ క్యూఆర్ కోడ్ పై వినియోగదారులకు అవగాహన కలిగించే విధంగా కరపత్రాలు కూడా అందిస్తున్నామని ఆయన వివరించారు, నకిలీ మద్యం, బెల్ట్ దుకాణాల పై ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు, మద్యం వినియోగదారులు కల్తీ, నకిలీ మద్యం సేవించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని గుర్తించి అటువంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన వివరించారు ఆయనతోపాటు ఎస్సై శ్రీరాం శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.

Post Comment

You May Have Missed

0Shares