సత్రశాల మల్లన్న సేవలో ఎమ్మెల్యే బ్రహ్మన్న…

సతీ సమేతంగా ప్రత్యేక పూజలు 

రాజధాని వాయిస్:ఫిబ్రవరి 16

రెంటచింటల.

 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని సత్రశాలలో కొలువురిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన సతీమణి శోభారాణి దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, గర్భాలయంలో కొలువుదీరిన స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేసి, ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares