సంచార పశు వైద్య వాహనాలను జెండా ఊపి…
ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత
అనగాని శివప్రసాద్
రాజధాని వాయిస్ :
జనవరి 09 రేపల్లె.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది. ప్రభుత్వం ఎప్పుడు రైతులకు తోడుగా ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శివప్రసాద్ఈ కార్యక్రమంలో తెలిపారు.
సోమవారం రేపల్లె నియోజకవర్గం పరిధిలోని 1962 సంచార పశు వైద్యశాల వాహనాలను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గాలలో ఉన్న గ్రామాలలో ఉచిత పశు వైద్య సేవలు అందించడానికి ఈ వాహనాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,పశు వైద్య సిబ్బంది, వీరితోటి టౌన్ సిఐ మల్లికార్జున రావు, ఈ కార్యక్రమంలో పాల్గొని జండా ఊపి సంచార పశు వైద్యశాల వాహనాలను ప్రారంభించారు.



Post Comment