షేక్ ఫిరోజ్ భాషా కు నాట్స్ ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారం ప్రదానం
తుమ్మలచెరువు ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్ బాషాకు నాట్స్ ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారం ప్రధానం
రాజధాని వాయిస్:డిశంబర్ 18,పిడుగురాళ్ల.
గుంటూరుపట్టణంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో జరిగిన జానపద సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారాల వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, ప్రెసిడెంట్ మందాడి శ్రీహరి కార్యక్రమ సమన్వయకర్త,మాజీ ఎమెల్సీ కెఎస్ లక్ష్మణరావు చేతుల మీదుగా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు గ్రామంలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్ బాషాకు నాట్స్ ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారాన్ని ప్రధానం చేశారు. విద్యార్థులకు అంకితభావంతో బోధిస్తూ, విద్యారంగంలో, ఉపాధ్యాయ వృత్తిలో చేస్తున్న విశేషమైన సేవలను, వినూత్నమైన కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డుని నాట్స్ సంస్థ ప్రకటించింది. ఇటీవల ఫిరోజ్ బాషాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు నుంచి ప్రశంసలు అందుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్ బాషాను వారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. కృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయులు, యుటిఎఫ్, జనవిజ్ఞాన వేదిక సంఘ నాయకులు గుబ్బా విజయ సారధి, షేక్ ఖాసింపిరా, షేక్ జమాల్, నరమాల హనుమంతరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. మరియదాస్ కె వి ఎస్ ఎన్ ప్రసాద్, డి శ్రీనివాసరావు, సాయిబాబు, మేడమ్ ఏడుకొండలు, మస్తాన్వలి, రాజశేఖర్, పి నాగేశ్వరరావు, సాముల హనుమంతరావు పలువురు ప్రముఖులు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.
Post Comment