శభాష్ పోలీస్ అన్న అని ప్రశంసలు అందించిన అడవులదీవి ప్రజానీకం
అక్టోబర్ 25 రాజధాని వాయిస్ ప్రతినిధి నిజాంపట్నం
పోలీస్ అనే పదం వినపడగానే అతను శాంతి భద్రతలు కాపాడేవారు అని అనుకుంటాం కానీ కొంతమంది పోలీసు వారు నేను సైతం మీలో ఒకరిని అంటూ మనమంతా కలిసి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకుందాం అని నడుం బిగించిన ఒక ఎస్ఐ అతను..ఎవరో కాదండి బాపట్ల జిల్లా లో అడవులదీవి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న బాబురావు..తను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో అడవుల దీవి సెంటర్లో పోలీస్ స్టేషన్ కి వెళ్లి మార్గంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి గుంతలలో నీళ్లు నిలిచి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఒక చిన్న ఆలోచనతో అతను సమాజానికి నేనున్నాను అని రుజువు చేసిన మహా మనిషి. కళ్ళ ముందు ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరును చూసి తక్షణమే వర్షానికి రోడ్లు కోతకు గురైన ఆ గుంటలను బయటనుంచి లారీలతో మట్టిని తోలించి రోడ్డుపై పడిన గుంటలను మట్టితో పూడ్పించి నీరు పోయే విధంగా ప్రో క్లీనర్ తో రోడ్డును సరి చేయించి మురికి నీరు పోయే దిశగా ఏర్పాటు చేయించారు.చూసిన ఊరు ప్రజలు పోలీస్ అంటే రక్షకబడులు అనుకున్నాముు కానీ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనని ఈరోజు తెలుసు కున్నాం అంటూ అడవుల దీవి ఊరి ప్రజలు శభాష్ పోలీస్ అన్న అని ప్రశంసలు తెలియజేస్తున్నారు.



Post Comment