శక్తి యాప్ ద్వారా మహిళలలుకు రక్షణ…
ఎస్సై శ్రీనివాసరావు
అక్టోబర్ 22
రాజధాని వాయిస్ : వేమూరు.
శక్తి యాప్ మహిళల రక్షణకు దన్నుగా నిలుస్తుందని వేమూరు ఎస్సై జి శ్రీనివాసరావు తెలియజేశారు.
బుధవారం జంపని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలకు శక్తి యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించారు, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు శక్తి యాప్ పై బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలికలు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే తన వెంట ఒక కుటుంబ సభ్యుడు తోడున్నట్లు అవుతుందన్నారు.
పాఠశాలకు కళాశాలకు వెళ్లే బాలికలపై అనుచిత వ్యాఖ్యలు చేసి భంగం కలిగే రీతిలో ప్రవర్తించినట్లయితే తమ ఫోన్ లో ఉన్న శక్తి యాప్ ను బటన్ నొక్కితే చాలు పోలీసులు వెంటనే స్పందించి వారికి అండగా నిలుస్తారని గుర్తు చేశారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించి దురు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు.ప్రభుత్వం పోలీసు యంత్రాంగం మహిళల భద్రతకు అనేక పటిష్ట చర్యలు తీసుకుంటుందని విద్యార్థులు వీటిపై అవగాహన పెంపొందించుకుని ముసులుకోవాలన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిన మహిళలపై దాడులు జరిగిన తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని వారికి గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్రి నారాయణ, ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



Post Comment