వ్యవసాయంలో సంస్కరణలే కూటమి ధ్యేయం…
గోకుల షెడ్ల నిర్మాణంలో జమ్మలమడక ఆదర్శం ఎమ్మెల్యే జూలకంటి
రాజధాని వాయిస్ :
జనవరి 6 మాచర్ల రూరల్.
సమగ్ర సంస్కరణలతో వ్యవసాయాభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జమ్మలమడక గ్రామంలో నిర్వహించిన రాజ ముద్రతో కూడిన పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నూతనంగా ప్రింట్ చేసిన పట్టదారు పాసు పుస్తకాలను రైతులకు ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజముద్రలో ఉన్న రాజసం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎలా తెలుస్తోందని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో ప్రచారం పిచ్చితో పొలం గెట్ల సర్వే రాళ్లపై తన ఫోటో వేసుకుని, రైతుల భూములను తాకట్టుపెట్టాలని చూశారని ఆరోపించారు. పట్టదారు పుస్తకాలపై జగన్ ఫోటోలు, నవ రత్నాల ప్రచారం చేస్తూ, రైతు లక్ష్యాలకు తూట్లు పొడిచారని విమర్శించారు.ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తో భూమిలపై ప్రజలకు పూర్తి స్ధాయిలో హక్కులు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.
గోకుల షెడ్ల నిర్మాణంలో జమ్మలమడక ఆదర్శం
గోకుల షెడ్ల నిర్మాణాల్లో నియోజకవర్గ స్ధాయిలో జమ్మలమడక ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే జూలకంటి రైతులను అభినందించారు. రూ. 11.50 లక్షల ప్రభుత్వ నిధులతో ఒకే రోజు నూతనంగా నిర్మించి ఐదు గోకుల షెడ్లను తాను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలానే కూటమి ప్రభుత్వం పశు గ్రాసం సాగుకు కూడా నిధులు కేటాయిస్తోందని, ఈ అవకాశాన్ని పాడి పరిశ్రమ రైతులు సద్వినియోగం చేసుకోవాని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో ఫణికుమార్ నాయక్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Post Comment