వైసిపి ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

 

రాజధాని వాయిస్ : చిలకలూరిపేట.అక్టోబర్ 24

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్ఆర్‌సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా ఉద్యమంలో భాగంగా, అక్టోబర్ 28న చిలకలూరిపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేటలోని
తన నివాసంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజా ఉద్యమం ప్రారంభమైందని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య ను దూరం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం పేదలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు .ఆనాడు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు, పేద విద్యార్థులకు ఉచిత వైద్యం విద్య అందించే విధంగా ఎంత కృషి చేశారో అందరికీ తెలిసిందేనని ఆ బాటలోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్థాపించారని, అలాంటి ప్రజల ఆస్తిని, ప్రైవేట్ వర్గాల చేతుల్లోకి వెళ్లనివ్వం అని తెలిపారు.
అలాగే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని మరింత జాగ్రత్తగా, సమర్థవంతంగా జరగాలని పార్టీ నాయకులకు,కార్యకర్తలకు సూచించారు.
ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాలపై నాయకులతో చర్చించారు. ర్యాలీని చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ మరియు మండలాధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares