వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

 

రేణిగుంట విమానాశ్రయంలో ఆంధ్రా మంత్రులు ఘన స్వాగతం…

రాజధాని వాయిస్:
డిసెంబర్ 29
తిరుపతి.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి పుణ్యకరమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఘనంగా స్వాగతం పలికారు.ఈ పవిత్ర ఉత్సవం సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు పొందాలని భక్తి భావంతో తిరుపతి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు ఆత్మీయంగా అభివాదనలు అర్పించారు. రెండు రాష్ట్రాల మధ్య సోదర సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఈ స్వాగతం ఆకట్టుకుంది. త్వరలోనే శ్రీవారి సేవలో పాల్గొని దర్శనం పొందనున్నారు.

Post Comment

You May Have Missed

0Shares