వైకాపాను గెలిపించడమే లక్ష్యం

కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాను

సత్తెనపల్లి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు ఏడుకొండలు

రాజధాని వాయిస్:సత్తెనపల్లి.అక్టోబర్ 21

నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని,అంకితభావంతో పని చేస్తానని వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన న్యాయవాది ఎమ్‌.ఏడుకొండలను అన్నారు. మాజీముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇటీవల ఉత్తర్వులు వెలువడిన సందర్భంగా ఏడుకొండలు మంగళవారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పూలమాలలు, దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ఏడుకొండలు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి పార్టీ లీగల్‌ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా తన వంతు పాత్ర పోషిస్తానని, లీగల్‌ సెల్‌ నుంచి అన్ని విధాలా నాయకులు, కార్య కర్తలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు. తన నియామకానికి సహక రించిన న్యాయవాదులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, సీనియర్‌ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు, న్యాయవాదులు కాశిమాల మార్కు,గుంటూరు.మాణిక్యరావు, తెనాలి నవజ్యోతిబాబు,బాదినేడి శ్రీనివాసరావు,రామాంజ నేయులు, తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares