వేమూరు నియోజకవర్గాన్ని సందర్శించిన వైకాపా సెంట్రల్ కమిటీ
వేమూరు నియోజవర్గాన్ని పరిశీలించిన వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కమిటి,
రాజధాని వాయిస్ డిసెంబర్ 23 వేమూరు,
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూచనల మేరకు సెంట్రల్ ఆఫీస్ నుండి వైసీపీ పార్టీ కమిటిల నిర్వహణ కమిటీ మంగళవారం వేమూరు నియోజకవర్గానికి విచ్చేశారు,ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు క్యాప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వహణ కమిటీ పాల్గొన్నారు.
వేమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గ్రామ కమిటీల ఏర్పాటు చేయటంలోని పారదర్శకంగా తీసుకున్న పద్ధతుల గురించి నాయకులను అడిగి తెలుసుకున్నారు.
నిర్వహణ కమిటీ సభ్యులు జోన్ వన్ ఇంచార్జీ హర్షవర్ధన్ రెడ్డి ,జోన్ త్రీ ఇంచార్జ్ రవీంద్రరెడ్డి,జోన్ ఫోర్ ఇన్చార్జ్ శివ శంకర్ ,స్టేట్ బూత్ కమిటీ ఇంచార్జీ సుందకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు ఎలా కృషి చేయాలో పలు చూచనలు సలహాలు తెలిపారు.
వేమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు చేపట్టిన కార్యక్రమాలను కొనియాడారు,ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి వేమూరు నియోజకవర్గంలోని వివిధ విభాగాలకు చెందిన నాయకులు అబ్జర్వర్ లు పాల్గొన్నారు.
Post Comment