వేద పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు
వేద స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు
రాజధాని వాయిస్:నవంబర్ 14,చిలకలూరిపేట.
చిలకలూరిపేట పట్టణంలో వేద స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని అసెంబ్లీ ఆవరణలో వందేమాతర గీతంతో ప్రారంబించి బాలల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ నాయకుల వేషధారణలో, ఉపన్యాసంలో అందరిని ఆకర్షించాయి.ఈ సందర్భంగా.పాఠశాల డైరెక్టర్ శ్రీగిరి పెర్సీస్వరూప మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అని చెప్పడంలో ఆంతర్యము ఏమిటంటే విద్యార్థులు చిన్నతనంలోనే క్రమశిక్షణాహిత విద్యను, క్రమశిక్షణ తో కూడిన జీవితము అలవాటు చేసుకుంటేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని, అప్పుడే భారత దేశము సర్వతో ముఖాభివృద్ది సాధిస్తుంది అని తెలిపారు. పాఠశాల అకమిక్ డైరెక్టర్ సత్య దీప్తి నవంబర్ 14వ తేదీన నెహ్రూ జయంతిని బాలల దినోత్సవం గా జరుపుకొంటాము . నెహ్రూ భారతదేశం యొక్క మొదటి ప్రధాని. భారతదేశ ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే రాబోయే తరం పటిష్టంగా ఉండాలి. అందుకే దేశ భవిష్యత్తు బాల బాలికలపై ఉన్నదని భావించి వారికి విద్య అవకాశాలను కల్పించి ,వారి భవిష్యత్తు జీవితాన్ని పూలబాటగా మార్చాలని ఆలోచనతోనే తన పుట్టినరోజును బాలల దినోత్సవం గా నిర్వహించమని తెలిపారు. ఆపరేషన్ హెడ్ జోసెఫ్ విద్యార్థినీ విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .దేశము యొక్క భవిష్యత్తు విద్యార్థుల చేతులలో ఉన్నదని ఆ విద్యార్థులకు సరైన మార్గదర్శకముతో వారిని నడిపిస్తే దేశ అభివృద్ధి సుసాధ్యము అవుతుంది అన్నారు. ప్రిన్సిపాల్ డేనియల్ మన మొదటి భారత ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళిక ఏర్పాటు చేసి వాటిలో భాగంగా విద్యార్థుల విద్యా వికాసానికి వ్యవసాయ అభివృద్ధికి, ప్రణాళికల ద్వారా సాధించి అభివృద్ధి బాటలోకి దేశాన్ని నడిపారని, పిల్లల యొక్క అభివృద్ధి దేశభవిష్యత్తుకు గీటురాయి ,అదీ బాలలపై ఉన్నది అనే ప్రగాఢ విశ్వాసం, అందుకే సుకుమారమైన గులాబీ పువ్వులు , సున్నిత మనసులైన చిన్న పిల్లల అన్న ఎనలేని మక్కువ, పిల్లలే దేశ అభివృద్ధికి మూల స్తంభాలు పునాది లేనిదే ఇల్లు నిలబడదు కదా !అలాగే చిన్న పిల్లలు అన్ని రంగాలలో వారిని తీసుకొని వెళితే దేశ భవిష్యత్తు అత్యున్నత స్థాయికి ఎదుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డేనియల్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయులు మనోహర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment