వెల్లటూరులోఘనంగా వేములపల్లి పుట్టినరోజు వేడుకలు
పేదలకు చేయూత
అక్టోబర్ 24 రాజధాని వాయిస్ భట్టిప్రోలు,
ఆపన్నులను ఆదుకోవడంలో వేములపల్లి రవికిరణ్ ఎల్లప్పుడూ ముందుంటారని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ అన్నారు. శుక్రవారంలక్ష్మి ఇన్ఫ్రాస్టక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత వేములపల్లి రవికిరణ్ జన్మదినం సందర్భంగా వెల్లటూరు గ్రామం నందలి చెన్నకేశవ కాలనీ లో ఏర్పాటు చేసిన రవికిరణ్ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రత్న ప్రసాద్ కేక్ కటింగ్ చేశారు.ఈ సందర్భంగా 200 కుటుంబాలకు హాట్ టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వెల్లటూరు గ్రామ సర్పంచ్ బొజ్జా రవి,కాట్రగడ్డ గోపాల్,కొల్లి రమేష్ చౌదరి,వాకా వెంకటనారాయణ, అమర్తులూరి హరి, తటవర్తి శేఖర్, నరసింహ, రమేష్,వంశీ,రవీంద్ర,రాజేష్,శ్రీను,సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.



Post Comment