వెంగళాయపాలెం చెరువు అభివృద్ధి పనులు పరిశీలించిన

 కేంద్ర మంత్రి పేమ్మసాని

రాజధాని వాయిస్:
నవంబరు 8
గుంటూరు.

పార్లమెంట్ సభ్యుడు,
కేంద్ర మంత్రి డా. పేమ్మసాని చంద్రశేఖర్ శనివారం వెంగళాయపాలెం గ్రామంలో చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ప్రజాప్రతినిధులు,అధికారులతో పాటు గ్రామ పెద్దలు హాజరయ్యారు.
చెరువుని పునరుద్ధరించి, ప్రజలకు వ్యాయామం, వినోదం, విహారానికి అనుకూలంగా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు ప్రశాంతంగా సాయంకాల వేళల్లో విహరించడానికి వాకింగ్ ట్రాక్, పచ్చదనం, పిల్లల ఆట స్థలాల వంటి ఏర్పాట్లను చేర్చారు.
ఈ సందర్భంగా జాతీయ వాటర్ షెడ్ సదస్సు మహోత్సవ స్థలాన్ని మంత్రి పేమ్మసాని పరిశీలించారు.

Post Comment

You May Have Missed

0Shares