వెంకన్న సేవలో మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబం..
రాజధాని వాయిస్: డిసెంబర్ 30
తిరుపతి.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారా దివ్యదర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరికి ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి కలగాలని మనసారా కోరుకున్నామని తెలిపారు. ఈ రోజు స్వామి వారి దర్శన కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పవిత్ర సందర్భంగా వైకుంఠ ఏకాదశి పవిత్రత ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సద్గుణాలు, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.



Post Comment