వృత్తి విద్యా విద్యార్థులకు ఇండస్ట్రియల్ విసిట్
రాజధాని వాయిస్
దుర్గి: అక్టోబర్ 17
జిల్లా పరిషత్ హై స్కూల్.దుర్గి.నందు వృత్తి విద్య కోర్స్ రిటైల్ ట్రేడ్ లో భాగంగా ఇండస్ట్రియల్విస్ట్ ను దేవి ఎంటర్ప్రైజెస్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ ను పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులతో సందర్శించి వారికి పూర్తి విద్యలో భాగంగా అమ్మకాలు, కస్టమర్ సర్వీస్ మరియు క్యాష్ ట్రైన్జక్షన్స్,క్యాష్ రికార్డ్స్ మెయింటెనెన్స్ ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి విద్యార్థులకు దేవి ఎంటర్ప్రైజెస్ వారు తెలియపరిచారు.ఈ యొక్క వృత్తివిద్య కోర్స్ విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధానోపాధ్యాయులుపి. కోటేశ్వరమ్మ ఉపాధ్యాయులు హనుమంతురావు, అనంత రామయ్య తెలియజేశారు. మరియు పాఠశాల ఒకేషనల్ ట్రైనర్ కె. గంగిరాజు విద్యార్థులకు వృత్తివిద్య కు సంబంధించిన శిక్షణలో ట్రేడింగ్ సంబంధించిన మెలుకువలు సూచనలు అందజేశారు.



Post Comment