విలువలతో కూడిన జర్నలిజం ఏపీయూడబ్ల్యూజే సభ్యులకే సాధ్యం..
నూతనంగా ఎన్నిక కాబడిన ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన చిలకలూరిపేట పుర ప్రముఖులు మరియు ఉన్నతాధికారులు, సీనియర్ రాజకీయ నాయకులు,
ప్రముఖ వ్యాపార వేత్తలు తదితరులు…
రాజధాని వాయిస్ : డిసెంబర్ 29 చిలకలూరిపేట
ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న రోటరీ క్లబ్ భవనంలో ఆదివారం సీనియర్ పాత్రికేయులు బాబుజీ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నూతన కార్యవర్గ ఎన్నికకు ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు పుల్లగూర.భక్తవత్సలరావు (99 టీవీ) మరియు షేక్.జిలాని (సాక్షి పత్రిక ఇంచార్జ్) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారుడిగా బాపూజీ రావు (ఆంధ్రజ్యోతి ఇంచార్జ్), గౌరవ అధ్యక్షులుగా కాట్రు శ్రీనివాసరావు (సాక్షి), అధ్యక్షులుగా పావులూరి బ్రహ్మానందం (బుజ్జి) (ఆంధ్రజ్యోతి), కార్యదర్శిగా ఉప్పాల బాలు (టీవీ-9), కోశాధికారిగా చుక్కా విజయ్ కుమార్ (ప్రతినిధి దినపత్రిక), ఉపాధ్యక్షుడిగా పుల్లగూర ప్రసన్నకుమార్ (సూర్య ఇంచార్జ్), జాయింట్ సెక్రటరీగా దోరడ్ల మల్లిఖార్జునరావు (సూర్య పేపర్) లను క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు బాబూజీ రావు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు భక్తవత్సలరావు, జిలానీలు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో విలువలతో కూడిన జర్నలిజాన్ని సమాజానికి అందిస్తున్న ఏకైక యూనియన్ ఒక్క ఏపీయూడబ్ల్యూజేకే సాధ్యమని వారు కొనియాడారు. ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ లో సీనియర్ పాత్రికేయులు ప్రముఖ దినపత్రిక మరియు టీవీ చానల్స్ లో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలను తీర్చడంలో ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ లో ఉన్న యూనియన్ జర్నలిస్టులకు మాత్రమే సాధ్యపడుతుందని వారు తెలిపారు. ఇలాగే ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ మిత్రులు అందరూ ప్రజల సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ప్రభుత్వం నుంచి అవినీతి రహిత పాలనను అందించేలా ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ యూనియన్ కట్టుబడి ఎండనక-వాననక, చలనక- వేడినక, పగలనక-రాత్రనక అహర్నిశలు శ్రమిస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు బాబుజీ రావు (ఆంధ్రజ్యోతి ఇన్చార్జ్), జిలాని (సాక్షి ఇంచార్జ్), మల్లికార్జునరావు (ఈనాడు ఇంచార్జ్), అబ్దుల్ సత్తార్ (ఆంధ్రప్రభ ఇంచార్జ్), విజయ్ కుమార్ (ఈనాడు టౌన్), వెంకటరాం ప్రసాద్ (ఆంధ్రప్రభ), సుదీర్ (సాక్షి టౌన్), అల్లాభక్షు (విశాలాంధ్ర), విజయ్ కుమార్ (ప్రతినిధి దినపత్రిక ఇంచార్జ్), శివ బాబు (రేపటి కోసం), వెంకట్ (సీఎం వాయిస్), మల్లికార్జున్ రావు (E TV), శేషగిరిరావు (CVR NEWS), బాలు (TV 9), జగదీష్ (TV 5), మధు (6 TV), భక్తవత్సలరావు (99 TV), కోటేశ్వరరావు (PRIME 9 TV), మనోజ్ (స్వతంత్ర టీవీ), వాసు (MAHA TV), మురళీకృష్ణ (HMTV), ఫక్రుద్దీన్ (MUNSUB TV), సత్యనారాయణ (YK TV), బుచ్చిబాబు (CC TV), శ్రీనివాసరావు (సాక్షి నాదెండ్ల), నారాయణస్వామి (ఆంధ్రజ్యోతి నాదెండ్ల), వెంకట్రావు (ఆంధ్రప్రభ నాదెండ్ల), మస్తాన్ వల్లి (ప్రజాశక్తి నాదెండ్ల), ప్రసన్న కుమార్ (సూర్య ఇంచార్జ్), కిషోర్ (శ్రేష్ట భారతి నాదెండ్ల), నాగయ్య (వనిత నాదెండ్ల), హసన్ వలి (సాక్షి ఎడ్లపాడు), బ్రహ్మానందం (ఆంధ్రజ్యోతి ఎడ్లపాడు), వెంకట్రావు (ఈనాడు ఎడ్లపాడు) శ్రీధర్ (వార్త ఎడ్లపాడు), ఆరుమల్ల నాగచౌదరి (ఆంధ్రప్రభ ఎడ్లపాడు), మల్లికార్జున్ రావు (ఎన్డిపి సూర్య), వైవి రమేష్ (ఆంధ్రభూమి), రామారావు (ప్రజాశక్తి) శ్రీనివాసరావు (విశాలాంధ్ర), పోపూరి నాగచౌదరి (ఆంధ్రపత్రిక) ఇలా చిలకలూరిపేట నియోజకవర్గంలోని చిలకలూరిపేట అర్బన్, చిలకలూరిపేట రూరల్ మండలం, నాదెండ్ల మండలం, ఎడ్లపాడు మండలంలోని ప్రముఖ పాత్రికేయులు, మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ భక్తవత్సలరావు, జిలాని మరియు ముఖ్య సలహాదారుడు బాబూజీ రావు నూతన ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.



Post Comment