విద్యకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాదాన్యత ఇస్తుంది
బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత
ఎంపి లావు శ్రీ కృష్ణ దేవరాయలు
ఎమ్మెల్యే కన్నాలక్ష్మీ నారాయణ
రాజధాని వాయిస్: సత్తెనపల్లి. అక్టోబర్ 28
నియోజకవర్గం,ముప్పాళ్ళ మండలం,మాదల గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ పాఠశాల, రాజుపాలెం మండల కేంద్రంలో బీసీ వెల్ఫేర్ వసతి గృహాలను బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత,నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు,సత్తెనపల్లిశాసనసభ్యుడు,మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మొంథా తుఫాన్ దృష్ట్యా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, వార్డెన్లు, 24 గంటలు హాస్టళ్లలో ఉండాల్సిందేనని, విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే ఇవ్వాలని, హాస్టళ్ల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.రాజుపాలెం బిసి బాలుర వసతి గృహం, మహాత్మ జ్యోతిబా పూలే బీసీ బాలికల వసతి గృహాలకు శాశ్వత భవన నిర్మాణాలకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. చదువుపైకూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, మనిషికి ఆహారం తర్వాత చదువు ఎంతో ముఖ్యం అన్నారు.వసతి గృహాన్ని పరిశీలించడానికి మంత్రి రావడం అభినందనయమని, ప్రస్తుతం నెలకొన్న వాతావరణ దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిసి వసతి గృహాల్లో పరిస్థితి ఎలా ఉందో చూడమని చెప్పడం కూటమి ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాదాన్యత ఇస్తుందో అర్ధం అవుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Post Comment