విజయ్ నిజాయతీ
- సిఐ అభినందనలు
రాజధాని వాయిస్ : అక్టోబర్ 17, నరసరావుపేట. నరసరావుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగంలో టిఫిన్ చేసేందుకు వచ్చిన నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామానికి చెందిన ఆశ పూర్ణ బంగారం ఆభరణాలు అనుకోకుండా పోగొట్టుకున్నారు.అదే సమయంలో అక్కడ టిఫిన్ చేయడానికి వచ్చిన విజయ్‌కి బంగారం వస్తువులు దొరకగా, వెంటనే నిజాయితీతో నరసరావుపేట వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. సీఐ ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో పోలీసులు ఆభరణాలు పోగొట్టుకున్న వ్యక్తిని గుర్తించి అప్పగించారు. విజయ్ నిజాయితీని సీఐ ఫిరోజ్ ఖాన్,తదితరులు అభినందించారు.



Post Comment