విగ్రహాల ఏర్పాటుకు  స్థలం కేటాయించండి ..

 

రాజధాని వాయిస్:ఫిబ్రవరి 07 దుర్గి.

 

ముటుకూరు గ్రామములోని ఎస్సీ కాలనీలో మెయిన్ రోడ్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డాక్టర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని

ఆ స్థలంలో విగ్రహాలు నిర్మించుకోవడానికి అనుమతులు ఇప్పించాలని కోరుతూ గ్రామం విగ్రహకమిటీ సభ్యులు కలిసి తహశీల్దార్ వర కుమార్ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ దుర్గి మండలం ఇన్చార్జి అన్నారావు, మాచర్ల బుజ్జి, ముటుకూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేష్, ఉపాధ్యక్షుడు మాచర్ల ఆంధ్రయ్య, విగ్రహ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, వెంకట్రామయ్య, సతీష్, సామేలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares