వాలీబాల్లో సత్తా చాటిన టి.యం.రావ్ హైస్కూల్ విదార్థులు

రాజధాని వాయిస్:

భట్టిప్రోలు.అక్టోబర్ 18

స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, యాజిలిలో జరిగిన బాపట్ల జిల్లా స్థాయి అండర్ 14, అండర్ 17 వాలీబాల్ పోటీ జరిగాయి. పోటీలలో అండర్ 14లో భట్టిప్రోలు మండల బాలికల టీమ్ రన్నర్స్ గా విజయం సాధించినదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందులూరి రామకోటేశ్వరరావు అన్నారు.శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ టీం లో షేక్ జుబేదా,షేక్ కలీమా,షేక్ యాసినా, కారంపూడి మమత, కసపరాజు సోనాక్షి, సయ్యద్ మునీరా, పాల్గొన్నారనీ తెలిపారు.
అండర్-14 ఉమ్మడి గుంటారు జిల్లా టీమ్ కు నక్కా మౌనిక, అండర్-17 జట్టకు పఠాన్ రవామత ఎంపిక అయ్యారన్నారు.
బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తమ్ క్రీడా విజేతలను మెడల్స్ అందించి సత్కరించి అభినందించారనీ ఆయన తెలిపారు. పోటీలకు శిక్షణ ఇచ్చిన భట్టిప్రోలు టి.యం.రావ్ హైస్కూల్ క్రీడా ఉపాధ్యాయులు చేబ్రోలు శ్రీనివాసరావును శాలువాతో సత్కరించి అభినందించారు.
విద్యార్థులను, ఉపాధ్యాయులను షేక్ కరీముల్లా,జిల్లా సెక్రటరీ కె బుజ్జి,ఎస్ జి ఎఫ్ మరియు పాఠశాల కరస్పాండెంట్ పులికొండ మల్లికార్జునరావు,ఎస్ఎంసి చైర్మన్ సుగుణకుమారి, పాఠశాల ప్రధానో పాధ్యాయులు రామకోటేశ్వరరావు, అనూల్ హక్,కే కోటేశ్వరమ్మ,ఉమా మహేశ్వరరావు, మురళీధరరావు సుబ్బారావు, శ్రీనివాసరావు. లక్ష్మీపార్వతి, సత్యారత్న తదితరులు అభినందించారు.

Post Comment

You May Have Missed

0Shares