వాయుగుండం ముప్పు దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్
రాజధాని వాయిస్ రేపల్లె 22 అక్టోబర్
దక్షిణ కోస్తా జిల్లాల్లో రెవెన్యూ అధికారులు సంసిద్ధంగా ఉండాలని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భారీ వర్షాలతో ఎక్కడెక్కడ వాగులు నదులు పొంగుతాయో అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.ఈ విపత్తు వల్ల ఎక్కడైనాచెట్లు విరిగిపడిన యెడల తక్షణమే అధికారులు స్పందించి ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వర్షాలున్నందున అధికారులంతా సహాయచర్యల్లో పాల్గొనాలని ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో అసౌకర్యము కలిగించకుండా చూడాలని ఆయా అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ముందస్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.



Post Comment