వాయుగుండం ప్రభావందృష్ట్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….
తహశీల్దార్
ఎం శ్రీనివాసరావు
అక్టోబర్ 22
రాజధాని వాయిస్ : భట్టిప్రోలు.
వాయుగుండం ప్రభావం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మండలంలో ని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తహశీల్దారు ఎం శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలోతెలియజేశారు.వాయుగుండం ప్రభావం కారణంగా జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని ఈ ప్రభావంతో కాలువలు,వాగులు పొంగే ప్రమాదం ఉందని,ప్రజలు ఇందుమూలంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం గ్రామాల్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అధికారులకు సమాచారం అందించాలని ఆయన తెలియజేశారు.



Post Comment