వానర సైన్యానికకి భయభ్రాంతులకు గురవుతున్న..
కారంపూడి గ్రామ ప్రజలు
రాజధాని వాయిస్:
నవంబర్ 8 కారంపూడి.
మండల కేంద్రమైన కారంపూడి పట్టణంలో
ఏ వీధి చూసిన ఏ బజారు చూసినా వానరుల బెడద ఎక్కువ అవుతుంది. రోజురోజుకు వానర సైన్యం ప్రజలపై దాడులు చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్లపై, ఇల్లు వద్ద, దుకాణాల్లో, వీధులలో వానరులు స్వైర విహారం చేస్తూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వానరుల నుండి రక్షించుకునేందుకు గ్రామ ప్రజలు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది.
ప్రజలు తమ పిల్లలను పాఠశాలలకు పంపించాలన్న,నిత్యవసర సరుకులు, కూరగాయలు, తినుబండారాలు వంటివి తీసుకు వెళ్తున్నప్పుడు ప్రజల మీద దాడి చేసి వారి దగ్గర ఉన్న కవర్లను ఎత్తుకు వెళ్తున్నాయి. చివరకు మోటార్ సైకిల్ లు మీద ఉండే సీట్ కవర్ ట్యాంక్ కవర్లు నోటితో చింపుతున్నాయి బండ్లను కింద పడేస్తున్నాయి.వానర సైన్యం తండోపాలుగా తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలువురు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. విచ్చలవిడిగా వానర సైన్యం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రమైన కారంపూడిలో వానరుల దాడులతో జనాలు పలుమార్లు తీవ్ర గాయాలు పాలవుతున్నారు ప్రాణాలకు ముప్పు వాటిల్ల విధంగా వానరుల దాడిలో గాయాలు పాలు కావాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు జరగక మునిపే ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టి వాహనరుల బెడదను నివారించాలని గ్రామస్తులు పంచాయతీ అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా వానరుల భారి నుండి స్థానిక ప్రజలను కాపాడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.



Post Comment