వాతావరణ హెచ్చరిక

 

అక్టోబర్ 22
రాజధాని వాయిస్ :రేపల్లె.

భారత వాతావరణ శాఖ (ఐ ఎం డి) మరియు యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్ (ఈ సి ఎం డబల్యు ఎఫ్ )అంచనాల ప్రకారం, 2025 అక్టోబర్ 22,నుంచి 26 తేదీలలో బాపట్ల జిల్లాలో అతి భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉందని తెలియజేయబడిందని ఈ సందర్భంలో, రేపల్లె డివిజన్ మండలాలలో నది పక్కన మరియు తక్కువ ఎత్తులో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండి, రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ అధికారులతో సహకరించవలసిందిగా రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయబడినవని,ఏవైనా అత్యవసర సహాయానికి క్రింది కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు.08648 293795 ప్రజలు పై నంబర్లను గమనించి. అవసరమైతే వెంటనే సంప్రదించవలసిందిగా వినతిచేయబడుచున్నది. అవసరమైన అన్ని జాగ్రత్తలు మరియు సహాయక చర్యలు పరిపాలన ద్వారా చేపట్టబడుతాయని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ద్వారా వెల్లడించారు.

Post Comment

You May Have Missed

0Shares