వాగులో పడిన స్కూటర్రిస్ట్ ను కాపాడిన సిఐ కిరణ్
రాజధాని వాయిస్:అక్టోబర్ 29,రాజుపాలెం.
మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు ప్రజల ప్రాణ రక్షణ సమాజ శ్రేయస్సును ప్రధాన ధ్యేయంగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులలో భాగంగా రాజుపాలెం మండలం, అనుపాలెం గ్రామం వద్ద గుంటూరు నుండి మాచర్ల కు వెళ్ళు హైవే రోడ్ లో ఎర్రవాగు నీటి ప్రవాహానికి చప్ట వద్ద రోడ్డు పై వరద నీరు ప్రవహించడంతో కొండమోడు గ్రామం నుండి సత్తెనపల్లి వైపు స్కూటీ పై బూసిరాజు శ్రీనివాసరావు తండ్రి వెంకటేశ్వర్లు వాగు దాటుతుండగా స్కూటీ టైర్స్ స్కిడ్ అయ్యి కింద పడడం వలన ప్రవహిస్తున్న వరద నీటిలో పడిపోవడం జరిగింది.ఆ సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న సత్తెనపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన కిరణ్ గమనించి సిబ్బంది సహాయంతో వ్యక్తిని కాపాడి స్కూటీ ని ఒడ్డుకు తీసుకుని రావడం జరిగింది.పోలీస్ సిబ్బంది సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.



Post Comment