నష్టపోయిన రైతులను ఆదుకుంటాం..
ఎమ్మెల్యే ఆనందబాబు
అక్టోబర్ 24 రాజధాని వాయిస్ వేమూరు,
భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన వరి పంట పొలాలను శుక్రవారం మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు.జంపని బూతుమల్లి గ్రామాల్లో నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించారు, రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వరి పంట పొలాలు నీట మునిగాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని గుర్తు చేశారు, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని వివరించారు.ఆయనతో పాటు టిడిపి నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, తాసిల్దార్ సుశీల, మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్, వేమూరి శేషుబాబు, చావలిసర్పంచ్ విష్ణుమొలకల శ్రీనివాసరావు,షేక్ అనీఫ్, బండారు సూరిబాబు, వట్టిప్రోలు యోబు,పలువురు రైతులు ఉన్నారు.



Post Comment