వరద ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి విడదల రజిని పర్యటన
రాజధాని వాయిస్ అక్టోబర్ 29 చిలకలూరిపేట.
నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రి విడదల రజిని పరిశీలించారు.మొంథా తుఫాన్ కారణంగా ముంపుకు గురైన చిలకలూరిపేట పట్టణంలోని సంజీవనగర్, తండ్రి సన్నిధి, సుగాలి కాలనీ, వీర ముష్టి కాలనీ ,గణపవరం శాంతి నగర్, పసుమర్రు ఎస్టీ కాలనీలను సందర్శించి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ఆహారం మరియు తాగునీరు అందజేశారు.చిలకలూరిపేటలో 22 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైన నేపథ్యంలో అనేక ప్రాంతాలు నీటమునిగినవి.చిలకలూరిపేటను వరద ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి, బాధిత కుటుంబాలకు తక్షణం పదివేల రూపాయల సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Post Comment