వరద బాధితులకు అండగా ఎమ్మెల్యే జూలకంటి
రాజధాని వాయిస్ : అక్టోబర్ 29 వెల్దుర్తి.
మండల పరిధిలోని మొంథా తుపాను బీభత్సం సృష్టించింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. దాదాపు 10 గ్రామాల ప్రజలు రాకపోకలు స్తంభించాయి. ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, వారిని సురక్షితంగా పునరావస కేంద్రాలకు తరలించాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు. శిరిగిరిపాడు చెరువు పరిధిలోని పరిశర ప్రాంత గ్రామాలను ఆయన సందర్శించి, పరిస్ధితిని పర్యవేక్షించారు. అనంతరం శిరిగిరిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాన్ని ఎమ్మెల్యే జూలకంటి సందర్శించి, సౌకర్యాలను సమీక్షించారు. అక్కడ ఉన్న ప్రజలకు తాగునీరు, ఆహారం, చిన్నారులకు అల్పాహారం , మందులను అందజేశారు. వరద బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారుకులకు, కూటమి పార్టీల నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్ నాయక్, ఎంపీడివో ప్రసాద్, టీడీపీ తెలుగుయువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కళ్లం రామాంజిరెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



Post Comment