వంతెన నిర్మాణం చేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలి
డిబిహెచ్ పి యస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్
రాజధాని వాయిస్:అక్టోబర్ 29,రొంపిచెర్ల.
రొంపిచర్ల మండలంలోని మాచవరం నుండి బెహరావారి పాలెం మధ్యలో గల వంతెన నిర్మాణం చేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ అన్నారు. తుఫాను కారణంగా ఆ వంతెనపై ఒగేరు వాగు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పాలకులు పట్టించు కొవాలని, గతంలో ఈ వంతెన నిర్మాణం చేపట్టాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కు నరసరావుపేట ఎంపీకి నరసరావుపేట ఎమ్మెల్యేకి వినతి పత్రాలు అందించామని వీలైనంత త్వరగా వంతెన నిర్మాణం చేపట్టి ప్రజల సమస్యలను తీర్చాలని వేడుకున్నామని తెలిపారు.నిత్యం 10గ్రామాల నుండి విద్యార్థులు,ప్రజలు ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉన్న వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు.



Post Comment