రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు
రాజధాని వాయిస్ భట్టిప్రోలు,అక్టోబర్ 24
భట్టిప్రోలు భారీ వర్షాలకు వెల్లటూరులోని ప్రధాన రహదారులు శుక్రవారం జలమయం అయ్యాయి. వెల్లటూరు మెయిన్ రోడ్డు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, యూనియన్ బ్యాంక్ కు వెళ్ళే రోడ్లన్నీ వర్షపు నీరుతో నిండిపోయాయి. ఈ రోడ్లపై వర్షపు నీరు ఉండటం వల్ల ప్రయాణికులు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రులకు వెళ్లేవారు రోడ్లపై ఉన్న నీటితో వెళ్లలేక పోతున్నారని అంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని కాలువలలోకి మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.



Post Comment