రేపు వెల్దుర్తికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాక..
రాజధాని వాయిస్ :
వెల్దుర్తి: అక్టోబర్ 26
మండల కేంద్రంలో సోమవారం అంగరంగ వైభవంగా జరగనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్ లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సందర్బంగా స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఎదురు దాదాపు 10 ఎకరాల్లో పార్టీ శ్రేణులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్, రిసెప్షన్ స్టేజ్,ఫుడ్ కౌంటర్ వంటి పలు ముందస్తు ఏర్పాట్లను ఎమ్మెల్యే జూలకంటి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దిగపు చిన వెంకటరామిరెడ్డి, కజ్జం సైదయ్య, జూలకంటి చిరంజీవి రెడ్డి, వెంకటరెడ్డి, యువ నాయకుడు అక్కిరెడ్డి, పాపిరెడ్డి, కేశిరెడ్డి హనిమిరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Post Comment