రేపటి భావి భారత పౌరులు
రాజధాని వాయిస్
ఏ అమావాస్యలో పుట్టూరో కానీ
అడుగు అడుగున అవమానలే
పలకా బలపం పట్టే మాచిట్టి సేతులకు
అడుగు అడుగున కష్టాలే
కొందరికి కన్నవారు వుండి
కొందరికి ఎవరూ లేక
పనికి బానిస అయి
మసివారిన మోములో
మోదమంటే ఎరగనివారు
బడికి వెళ్లాల్సిన వయస్సులో
భుజాన సంచి వేసుకుని
కాగితాలు ఏరుకుంటున్నారు
తల్లిదండ్రులతో హోటల్లో
సంతోషంగా విందు ఆరగించు వయస్సులో
కప్పు సాసర్లు కడుగుతున్నారు
చీవాట్లు చీదరింపులు
దెబ్బలు వారికి ఇచ్చే సత్కారములు
తిని పడేసిన ఎంగిలి మెతుకులు
వారి విందు బోజనాలు
ఈ పాపం కన్నవారిది
ఈ శాపం మన అందరిది
రాయిని చులకన చేస్తే
తట్టు తాకి కింద పడుతాము
రాయిని సరిఅయిన మార్గంలో పెడితే
గొప్ప శిల్పంగా మారుతుంది
బాలకార్మికులను చులకన చేస్తే
గ్యాంగ్లీడర్ అవుతారు
బాలకార్మికులను అక్కునచేర్చుకుంటే
దేశానికే దిక్సూచి అవుతారు
బడి ఈడు పిల్లలని బడిలో చేరుద్దాం
బంగరు భవితకు బాటలు వేద్దాంబాలలకు మంచిరోజులు రావాలని కోరుకుంటూ
రచన మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం



Post Comment