రేపటి నుంచి స్వర్ణాంధ్ర, స్వచ్చంద్ర కార్యక్రమం ప్రారంభం.

రాజధాని వాయిస్

అక్టోబర్ 18

శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో  ఆదివారం నుంచి స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. మొట్టమొదటిగా మాచర్ల తాహ శీల్దార్ కార్యాలయంలోని పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క స్ఫూర్తితో 2012 సంవత్సరం నుండి 2018 సంవత్సరం వరకు దిగ్విజయంగా మాచర్ల పట్టణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గోవింద రెడ్డి తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మరల స్వర్ణాంధ్ర,స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం 7 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు గోవింద రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజీలు, దేవాలయాలు, చర్చి, మసీదులు ఎక్కడ స్వచ్ఛత అవసరము అక్కడ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఉండే విధంగా ప్రతి ఆదివారం నిర్వహిస్తామని ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి తెలియజేశారు. మానవసేవయే, మాధవసేవ అన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో, పరిశుభ్రత లోనే పరమాత్ముడు అన్న మహాత్మా గాంధీ స్ఫూర్తితో, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి శ్రీరామకృష్ణ సేవా సమితికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరములకు 944 000 6813, 9346162835లను సంప్రదించగలరని ఆయన కోరారు

Post Comment

You May Have Missed

0Shares