రెయిన్ అలర్ట్…..
వాతావరణ శాఖ సూచనల మేరకు మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
రాజధాని వాయిస్ : అక్టోబర్ 23 గుంటూరు
వాతావరణ శాఖ సూచనల మేరకు మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిఎంసిలో 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ 08632345103 ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు
గుంటూరు నగరంలో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో నిలిచే వర్షం నీటిని ఎప్పటికప్పుడు బెయిల్ అవుట్ చేయడానికి మోటార్లను సిద్దం చేసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.
3 వంతెనలు, కంకరగుంట ఆర్యూబి దగ్గర,రింగ్ రోడ్, చుట్ట గుంట సెంటర్ లోని లోతట్టు ప్రాంతంలో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, కల్వర్ట్ ల దగ్గర ఏర్పాటు చేసిన మెష్ ల వద్ద నిలిచే వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సంబందిత డిఈఈలకు, ప్రజారోగ్య అధికారులకు ఆదేశించారు.
నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, వార్డ్ సచివాలయ కార్యదర్శులు వర్షం తగ్గే వరకు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని,విధ్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటున్నందున త్రాగునీటి సరఫరాకి సమస్య రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఏఈలకు, ఎక్కడైనా చెట్లు పడిపోతే తొలగించడానికి సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఏడిహెచ్ కి ఆదేశించారు.
పురాతన భవనాల్లో నివాసం ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, హోర్డింగ్స్ పై పర్యవేక్షణ చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులకు తెలిపారు.
నగర ప్రజలు త్రాగునీటిని కాచి చల్లార్చుకొని త్రాగాలని, ఎక్కడైనా వర్షాల వలన సమస్యలు ఎదురైతే 24 గంటలు అందుబాటులో ఉండే జిఎంసి కాల్ సెంటర్ 08632345103 కి కాల్ చేయవచ్చని కమిషనర్ వెల్లడించారు.



Post Comment