రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన
మంత్రి అనగాని సత్యప్రసాద్
అక్టోబర్ 19
రాజధాని వాయిస్:
రేపల్లె.
చీకట్లను తరిమికొట్టి సరికొత్త కాంతులు విరజిమ్మే వెలుగుజిలుగుల దీపావళి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రజలకు, రేపల్లె నియోజకవర్గ ప్రజలకు మంత్రి అనగాని సత్య ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కాంతులతో ప్రతి ఇంటా సంతోషం వెలుగుతున్న తరుణంలో ఈ దీపావళి కానుకగా పరిశ్రమలకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలకు సంబంధించి తొలి విడతగా రూ. 15 వందల కోట్లను విడుదల చేయడమైనదని మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక విడత
డీఏ విడుదల చేయడం జరిగినది.అలాగే ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ఏపీలో ప్రారంభం అవుతోందన్నారు. ఇటీవల కర్నూలుకు వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులను ప్రకటించారు. అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది.ఇక సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంక్షేమ సంబరం నెలకొంది. పింఛన్లు, మహిళలకు ఉచితబస్సు, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ల సేవలో వంటి పథకాలు ఇవ్వడం జరిగింది.
గత ప్రభుత్వపు చీకట్లు తొలగిస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ వెలుగులను ప్రతీ ఇంటి ముందుకు తెస్తోన్న తరుణాన ఆ శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహంతో రాష్ట్రం ప్రగతిపథంలో ముందడుగు వేస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా దేదీప్యమానంగా వెలిగిపోవాలని, ప్రజలందరూ సుఖశాంతులతో విలసిల్లాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.



Post Comment