రాజాం మునిసిపల్ కమీషనర్ గా శానిటరి ఇన్స్పెక్టర్
ఆకు రాతి రామచంద్రరావు
రాజధాని వాయిస్: నవంబర్ 08
రేపల్లె.
మునిసిపల్ శానిటరిగా పనిచేస్తున్న ఆకురాతి రామచంద్రరావు రాజాం మునిసిపల్ కమీషనర్ గా నియమించబడ్డారు.
దీనికి సంబంధించిన ఉత్తర్వులు కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు జారీ చేశారు.మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచనలతో పట్టణంలో చెత్త పాయింట్స్ ను శుభ్రం చేసి, ఆ ప్రదేశాలలో మొక్కలు నాటటం, శానిటేషన్ మెరుగుదలలో చురుకుగా పాల్గొనటం, ఉద్యోగులను విహారయాత్రలకు తీసుకెళ్ళటంలో తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర శానిటరి ఇన్స్పెక్టర్ల అసోసియేషన్ లో కీలకంగా ఉంటూ, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.
కమీషనర్ గా పదోన్నతి పొందిన రామచంద్రరావుకు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, మునిసిపల్ సిబ్బంది అభినందనలు తెలియచేసారు.



Post Comment