రాజధాని వాయిస్ క్యాలెండర్ ఆవిష్కరించిన…
ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
రాజధాని వాయిస్:జనవరి 24,సత్తెనపల్లి.
రాజధాని వాయిస్ దిన పత్రిక వారి 2026 నూతన సంవత్సర క్యాలండర్ ను ఆవిష్కరించిన సత్తెనపల్లి శాసనసభ్యుడు,మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ.ఈ సందర్బంగా కన్నా మాట్లాడుతూ నేడు మీడియా ద్వారా ప్రపంచంలో ఏ ఒక్క సంఘటన జరిగిన క్షణాలలో ప్రజలకు చేరువవుతుందని,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో పత్రికలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని,రాజధాని వాయిస్ పత్రిక కూడ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు,డిఎన్ ఆర్ పౌండేషన్ చైర్మన్ దరువూరి నాగేశ్వరరావు,రాజుపాలెం మండల టిడిపి అధ్యక్షుడు అంచుల నరసింహారావు,రాజధాని వాయిస్ అసోసియేట్ ఎడిటర్ కోట బాబురావు,టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment