రచ్చబండ కార్యక్రమం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
రాజధాని వాయిస్ :
చిలకలూరిపేట.
చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజిని పిలుపు మేరకు బుక్కాపురం గ్రామంలో రచ్చబండ
కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వ వైద్య విద్యను కాపాడాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షుడు మంగు ఏడుకొండలు,మాజీ ఎంపీపీ కంజుల వీరారెడ్డి ఉపాధ్యక్షుడు అల్లాడి రవి కుమార్ ,సీనియర్ నేత సింగారెడ్డి కోటిరెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ భాషా ,బుక్కాపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు చట్టాల నాగరాజు, బూత్ కన్వీనర్ బుర్రి అరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ కు సంబంధించి పలు విషయాలు ప్రజలకు వివరించారు.



Post Comment