మెంథా తుఫాన్ నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలి
ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
రాజధాని వాయిస్: పెదకూరపాడు. అక్టోబర్ 27
మెంథా తుపాను తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు.నియోజకవ ర్గంలోని రెవెన్యూ, పోలీస్, ఆర్ డబ్ల్యూఎస్, ఇరి గేషన్, విద్యుత్, వ్యవసాయ అధికారులకు పలు సూచనలు చేశారు.ప్రమాదాలను ముందస్తుగా అంచనా వేసి ప్రాణ,ఆస్తి నష్టం లేకుండా చూడాలన్నారు.అధికారులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పని చేయాలన్నారు.తుఫాన్ ప్రభావం తగ్గే వరకు స్థానిక నాయకుల సహకారంతో సహాయ కార్యక్రమాలను చేపట్టాలన్నారు.లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు.



Post Comment