మెంథా తుఫాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాజధాని వాయిస్: వేమూరు. అక్టోబర్ 27
మెంథా తుఫాను ప్రభావం వల్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాహశీల్దార్ సుశీల ఒక ప్రకటనలో తెలియజేశారు.మంగళ,బుధవారాలు ప్రయాణాలు రద్దు చేసుకుని ఇంటి వద్దనే ఉండాలని, ఆమె తెలియజేశారు.వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు చెట్ల కింద ఉండకూడదన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.



Post Comment