మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న
వ్యవసాయ సంచాలకులు లక్ష్మి
అక్టోబర్ 25 రాజధాని వాయిస్ కొల్లూరు,
భారీ వర్షంకు నీట మునిగిన, పడిపోయిన వరి పంటను సహాయ వ్యవసాయ సంచాలకులు ఎ లక్ష్మి శనివారం పరిశీలించారు. కొల్లూరు మండలంలోని కొల్లూరు, క్రాప గ్రామాలలో ఆమె మాట్లాడుతూ అధిక వర్షాల వలన వరి పంట వివిధ దశలలో ముంపుకు గురి అయినట్లైతే, నీటిని పూర్తిగా తీసివేసి ఒక ఎకరానికి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ను బూస్టర్ డోస్ గా వేసుకోవాలి. నీరు తీయలేని పక్షంలో పైరుపై 2 గ్రాముల యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ను పిచికారీ చేస్తే పైరు త్వరగా పుంజుకుంటుంది. తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 1 గ్రా. కార్బెండిజిమ్ లేక 2 గ్రా కార్బెండిజిమ్ మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలన్నారు. ఈ పరిశీలనలో ఏవో నరేంద్రబాబు రైతులు ఉన్నారు.



Post Comment