మాల మహానాడు ఆద్వర్యంలో ప్రపంచ మేదావి వర్ధంతి వేడుకలు

మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు పంపిణీ

రాజధాని వాయిస్:డిశంబర్ 6,నరసరావుపేట.

మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు,జేబి ఫౌండేషన్ అధినేత డాక్టర్ గోదా జాన్ పాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 69 వర్ధంతి ని పురస్కరించుకొని నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనయ్య నగర్ లో గల డా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం డాక్టర్ రాజేంద్రప్రసాద్ స్కూల్ నందు గల విద్యార్థులకు మాజీ కౌన్సిలర్ శీలు బాబురావు వివిధ సంఘాల నాయకుల చేతుల మీదుగా పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు పంపిణీ చేయటం జరిగింది. తదుపరి గడియార స్తంభం సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూనమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం జాన్ పాల్ మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగంలోని హక్కులు కాల రాయబడుతున్నాయని,ఒక మనిషి చనిపోయి నేటి 69 సఏళ్ళు గడుస్తున్న ఇప్పటికీ దేశవ్యాప్తంగా వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే ప్రపంచంలోనే అన్ని దేశాలు రాజ్యాంగం కన్నా భారత దేశ రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం కలిగి అన్ని మతాలు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు కల్పించిన హక్కుల ప్రదాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ వర్కింగ్ మాల మహానాడు అధ్యక్షులు విస్తాల జయరావు, గడ్డిపర్తి పాపారావు, జన జాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు పిడతల రమాదేవి, మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి, రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కృష్ణకుమారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను, BSP పల్నాడు జిల్లా ఇంచార్జ్ బూదాల బాబురావు, నరసరావుపేట మండలం మాల మహానాడు అధ్యక్షులు ముచ్చు బ్రహ్మం, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు,పట్టణ సెక్రటరీ మెడబలిమి సాంబశివ,జంగా సీతయ్య, సండ్ర శౌరి,తిప్పగూడేశ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు ….
జై భీమ్ …

Post Comment

You May Have Missed

0Shares