మాయమై పోయాడమ్మా అందెశ్రీ
మాయమై పోయాడమ్మా అందెశ్రీ
రాజధాని వాయిస్:నవంబరు 10,హైదరాబాద్.
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే అద్భుతమైన పాటను వ్రాసిన గొప్పకవి అందెశ్రీ (64) హైదరాబాద్ లో ఇంటిలో కుప్ప కూలీపోయారు.వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే హాస్పటల్ జాయిన్ చేశారు.అప్పటికే చనిపోవడం జరిగిందని డాక్టర్లు చెప్పారు.అందే శ్రీ మరణం సాహిత్యలోకానికి, సమాజానికి తీరనిలోటు, ప్రముఖులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందే శ్రీ మరణం పట్ల సంతాపం తెలిపారు. వారికుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.



Post Comment