మాచవరం నూతన ఎంపిపి అంజమ్మకు శుభాకాంక్షలు వెల్లువ
బీసీలకు ఎమ్మెల్యే యరపతి శ్రీనివాస రావు అత్యంత ప్రాదాన్యత ఇస్తున్నారు
రాజధానివాయిస్:డిసెంబర్ 12,పిడుగురాళ్ల.
పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆశీస్సులుతో మాచవరం మండల ఎంపీపీ గా ఎన్నికైన కొక్కెర అంజమ్మ ను కూటమి నాయకులు ఘనంగా సన్మానించి అభినందించటం జరిగినది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బీసీలకు ప్రాధాన్యతనిస్తూ బీసీలకు వెన్నుముక గా నిలుస్తూ,అనేక ఉన్నత ప్రభుత్వ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని,బీసీలు ఎంపీపీగా ఎన్నిక కావడం ఓర్చు కోలేక మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి యరపతనేనిని విమర్శించడాన్ని ఖండించారు.ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక జరిగితే టిడిపికి 6,వైసిపికి 4,నొటా కు 1 ఎంపిటిసిలు ఓట్లు వేశారని,వైసిపి కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు.అన్నీ వర్గాల ప్రజలకు టిడిపి ప్రాదాన్యత ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మాచవరం ఎంపీపీ అంజమ్మ, పట్టణ టిడిపి అధ్యక్షుడు పిల్లి చెన్నారావు,జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ అమీర్ అలీ,వాణిజ్య విభాగం అధ్యక్షుడు పాండురంగా శ్రీను,జిల్లా ఉపాధ్యక్షుడు మేకల సాంబశివ రావు,సహాకార సంఘం అధ్యక్షుడు గండికోట వెంకటేశ్వర్లు,శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్,జిల్లా కార్యదర్శి ఖాసీం సైదా,వల్లెపు రామకృష్ణ,చిన్నా,రాజు, అన్ని మండలాల కన్వీనర్లు, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్య నాయకులు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.



Post Comment