మాచర్లలో ఘనంగా మాజీ సిఎం పుట్టినరోజు వేడుకలు

మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్. జగన్ జన్మదిన వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న పల్నాడు జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కిల్లా. రత్నకుమారి

 రాజధాని వాయిస్:మాచర్ల 

 

మాచర్ల లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి సతీమణి పిన్నెల్లి. రమ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కిల్లా. రత్నకుమారి పాల్గొని పిన్నెల్లి. రమ తో కలిసి పుట్టినరోజు సందర్బంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరన్ని పిన్నెల్లి. రమా తో కలిసి సందర్శించి రక్తదానం చేసిన ప్రతిఒక్క వైసీపీ నాయకునికి ఆమె ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares