మత్స్యకారుల ఉన్నతికి సంక్షేమమే ఊతం..!

 ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

 

రాజధాని వాయిస్ నవంబర్ 8 మాచర్ల.

 

మత్స్యకారుల ఉన్నతికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండల పరిధిలో పెద్ద అనుపు వద్ద ఉన్న కృష్ణా జలాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 6.20 లక్షల చేప పిల్లలను ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, గురజాల ఆర్డీవో మురళీ, మత్స్యశాఖ డీ.ఎఫ్.వో సంజీవ్ రావు విడిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసీపీ హయంలో మత్స్యకార సంక్షేమాన్ని గాలికొదిలేసి, దాదాపు 11 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో వేట నిషేదం సమయంలో అందిస్తున్న రూ. 10 వేల సాయాన్ని రూ. 20 వేలకు పెంచి, కూటమి ప్రభుత్వం అందిస్తోందని చెప్పుకొచ్చారు. అలానే హై ఫ్రీక్వెన్సీ సెట్లు, జీపీఎస్‌, గిల్‌సెట్లు, ఫిష్‌ పైండర్స్‌, వలలు, తెప్పలు, ఐస్‌బాక్స్‌లు, ద్విచక్ర వాహనాలు, లగేజీ వాహనాలను 90శాతం రాయితీపై అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కిరణ్ కుమార్, ఎస్సై అశోక్, మత్స్యశాఖ ఇన్సెఫెక్టర్ లు శ్రీనివాసరావు, పిల్లి వెంకట్రావు, మత్స్యకార సంఘం అధ్యక్షుడు అప్పలరాజు, సభ్యులు దేవుడు, నర్సింహులు, సింహాద్రి, భూలోక్, టీడీపీ మండల అధ్యక్షుడు వీరాస్వామి యాదర్, నాయకులు శేర్రెడ్డి గోపిరెడ్డి, కోటయ్య, వెంకటేశ్వర్లు, వీరస్వామి, స్వామీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares