మట్టి ఖర్చుల నిమిత్తం గ్రేస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం
రాజధాని వాయిస్: కొల్లూరు. అక్టోబర్ 27
మండలంలోని క్రాప గ్రామానికి చెందిన పైడిపాముల మరియదాసు (50) అనారోగ్య కారణాలతో మృతి చెందగా విషయం తెలుసుకున్న గ్రేస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ అయితేపల్లి షాలెంరాజు మృతుని కుటుంబానికి మట్టి ఖర్చులు నిమిత్తం 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రేస్ ఫౌండేషన్ సభ్యుల ద్వారా అందించారు.ఈ సందర్భంగా గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు మరియుదాస్ కుటుంబాన్ని పరామర్శించి నగదు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు గ్రామ పెద్దలు ఉన్నారు.



Post Comment